ATP: అండర్-15 క్రికెట్ టోర్నమెంట్లో తాడిపత్రికి చెందిన సంగం అఫ్రీన్ తాజ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఛాంపియన్స్ ఎలివేన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో తాడిపత్రి ఆర్డీటీ జట్టు విజయం సాధించింది. 24 ఓవర్లలో 77 పరుగులకు ప్రత్యర్థి జట్టు ఆలౌట్ కాగా, ఆర్డీటీ జట్టు 10.3 ఓవర్లలో 80 పరుగులు చేసి గెలిచింది. అఫ్రీన్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు గెలుచుకుంది.