MDCL: బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి ఐపీఎస్ పిలుపునిచ్చారు. నేరేడ్మెట్ సీపీ కార్యాలయంలో ముస్లిం, గోరక్షక్ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పండుగకు ప్రత్యేక బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వదంతులను నమ్మవద్దని, చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా పోలీసులకు సహకరించాలన్నారు.