కృష్ణా: బాపులపాడు మండలం వేలేరు క్రాస్ రోడ్స్ వద్ద దొంగల ముఠాను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 169 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించామని డీఎస్పీ పాల శ్రీనివాస్ అన్నారు. ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.