NDL: వడ్ల రామాపురంలో మహిళల భద్రత కోసం “శక్తి యాప్”పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెడ్ కానిస్టేబుల్ నూర్ అహ్మద్, డబ్ల్యూహెచీ సుప్రియ మహిళల రక్షణ, పోక్సో చట్టం, సైబర్ నేరాలను వివరించారు. శక్తి యాప్, 112, 181, 1930 వంటి అత్యవసర నంబర్ల వినియోగంపై మహిళలకు అవగాహన కల్పించారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ప్రజలకు సూచించారు.