ప్రకాశం: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తెలిపారు. శనివారం ఒంగోలు ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన రెవెన్యూ గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల వద్ద నుంచి వచ్చిన వినతులను అధికారులు వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.