SKLM: పేదలందరికీ సొంతిల్లు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు శనివారం క్యాంపు కార్యాలయంలో కోటబొమ్మాళి మండలం దంత గ్రామానికి చెందిన 39 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పేరుతో మోసం చేసిందని, కూటమి ప్రభుత్వం శరవేగంగా ఇళ్ల నిర్మాణం చేపడుతోందని తెలిపారు.