ELR: ముసునూరులో శనివారం ఎస్సై ఎం.చిరంజీవి తన సిబ్బందితో కలిసి విజిబుల్ పోలీసింగ్, రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, “వేగం వద్దు-ప్రాణం ముద్దు” అనే నినాదాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని సూచించారు.