VSP: దళితులకు రాజ్యాంగబద్ధమైన హక్కులు, సామాజిక న్యాయం కల్పించడం ప్రభుత్వ సంస్థల బాధ్యత అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు సీతారాం అన్నారు. వీఎంఆర్డీఏ కార్యాలయంలో అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నియామకాలు, కాంట్రాక్టులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు కేటాయింపుల్లో ఎస్సీలకు సముచిత ప్రాధాన్యత కల్పించాలన్నారు.