VSP: జనాభా గణన-2027 కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జనగణన పురోగతిని ఆయన సమీక్షించారు. హౌస్ లిస్టింగ్, జనాభా నమోదు, ఖాళీ ఇళ్ల గుర్తింపు వంటి అంశాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పూర్తి చేయాలని సూచించారు.