HNK: ఐనవోలు మండలంలో తీవ్ర ఎండల కారణంగా వడదెబ్బతో శనివారం ఒకేరోజు నలుగురు మృతి చెందారు. మండల కేంద్రానికి చెందిన బండ చిన్న మల్లయ్య (90), కక్కరాలపల్లి గ్రామానికి చెందిన అల్వాల నీలమ్మ (75), తాళ్లపెల్లి శాంతమ్మ (80), శంకపల్లి లక్ష్మీనారాయణ(74) ప్రాణాలు కోల్పోయారు. ఘటనతో మండలంలో విషాదం నెలకొనగా, ప్రజలు ఎండల సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.