ASR: చింతపల్లి మండలంలో బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమ పశువుల రవాణాపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు మార్గదర్శకాల మేరకు జంతు సంరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నట్లు సీఐ ఎం. వినోద్ బాబు తెలిపారు. చెక్‌పోస్టులు, ప్రధాన రహదారులు, సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టామని చెప్పారు.