PPM: జిల్లాలోని విద్యార్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కడప డా. వైఎస్ఆర్ క్రీడా పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 4, 5, 6వ తరగతుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి డా. కె. శ్రీధర్‌రావు తెలిపారు. ఈనెల 19 నుంచి జూన్ 2 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.