స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. SSC సీజీఎల్ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 12,256 గెజిటెడ్ & నాన్ గెజిటెడ్ గ్రూప్-బీ, సీ పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్, డిగ్రీ అర్హత గల అభ్యర్థులు జూన్ 22 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, ఓబీసీ, EWS అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.