ASF: జూన్ 2న CM రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో SP నితిక పంత్ శనివారం కెరమెరి మండలం కొత్తగూడ గ్రామాన్ని సందర్శించారు. సీఎం పర్యటనకు సంబంధించి క్షేత్రస్థాయిలో చేపడుతున్న ఏర్పాట్లను ఆమె స్వయంగా పరిశీలించారు. భద్రతా చర్యలు, వాహనాల పార్కింగ్, రాకపోకల మార్గాలపై అధికారులతో సమీక్షించారు. పర్యటన విజయవంతానికి అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు.