TG: ‘రైతు గోస-బీజేపీ భరోసా’ పేరుతో బీజేపీ పోరుబాట నిర్వహించేందుకు సిద్ధమైంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనుగోలు కేంద్రాల వద్ద ఉంటారు. తొలిరోజు తాండూరులో, రెండో రోజు గజ్వేల్, భువనగిరి, వరంగల్లో, మూడో రోజు భూపాలపల్లి, కాటారం, మంథని, పెద్దపల్లిలో పోరుబాట చేయనున్నారు.