శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం కుటుంబ సమేతంగా పీఎం మోదీని ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని కొంతసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. ప్రధానిని కుటుంబంతో కలిసి కలిసే అవకాశం దక్కడం ఎంతో ఆనందంగా, గర్వంగా భావిస్తున్నానని కేంద్ర మంత్రి తెలిపారు. పీఎం ఆప్యాయత, ఆశీస్సులకు తమ కుటుంబం ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటుందన్నారు.