NTR: జిల్లాలో బడి పిలుస్తోంది కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. వత్సవాయి మండలం భీమవరం, మక్కపేట గ్రామాల్లో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశా పర్యటించి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యత వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, డిజిటల్ సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, యూనిఫారాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.