MLG: వరంగల్ ఉమ్మడి జిల్లా ఆర్డీవో బదిలీల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. శనివారం తాజా ఉత్తర్వులతో హనుమకొండకు కేటాయించిన నిర్మలను ములుగు ఆర్డీఓగా నియమించగా, ప్రస్తుతం ములుగులో పనిచేస్తున్న వెంకటేష్‌ను హనుమకొండకు బదిలీ చేసింది. ఈ మార్పులతో జిల్లా పరిపాలనా వర్గాల్లో చర్చ నెలకొంది.