RR: మియాపూర్ మయూరి నగర్ కాలనీలో రూ. 16 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 102 సీసీ కెమెరాలను పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరాల అదుపునకు సీసీ కెమెరాలు నిఘా నేత్రాలుగా పనిచేస్తాయని, ప్రతి కాలనీలో వీటిని ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.