MDCL: మల్కాజిగిరి జోన్ జోనల్ కమిషనర్ గంగ్వార్ అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చ బొల్లారం ప్రాంతాన్ని సందర్శించి కొనసాగుతున్న జనగణన సర్వే పనులను పరిశీలించారు. సర్వేలో ఎదురవుతున్న సమస్యలపై సమీక్ష నిర్వహించి పరిష్కార చర్యలు సూచించారు. ఫీల్డ్ వెరిఫికేషన్ చేపట్టి ప్రతి ఇంటికి సమర్థవంతంగా చేరేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.