MLG: ములుగు మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన రైతు రాస నిర్మల సాగు చేసిన మిరప పంట శనివారం కరెంటు షార్ట్ సర్క్యూట్తో అగ్నికి ఆహుతైంది. మార్కెట్కు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 20 మిరప బస్తాలు పూర్తిగా దగ్ధమై రూ.2 లక్షల నష్టం వాటిల్లింది. ఇప్పటికే భర్తను కోల్పోయిన నిర్మల పంట నష్టంతో బోరున విలపించింది. బాధితురాలిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని స్థానికులు కోరారు.