MBNR: యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మహబూబ్నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువతకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడించారు.