SRCL: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పింఛన్ల లైవ్ అథెంటికేషన్, ధ్రువీకరణ ప్రక్రియ వేములవాడ పట్టణంలో ముమ్మరంగా కొనసాగుతోంది. శనివారం పట్టణంలోని 4వ వార్డు పరిధిలో నిర్వహిస్తున్న అన్ని రకాల పింఛన్ లబ్ధిదారుల ఆధార్ అప్డేట్ ప్రక్రియను మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు, స్థానిక వార్డు కౌన్సిలర్ తోట రాజుతో కలిసి స్వయంగా పరిశీలించారు.