ASF: చట్టాలపై అవగాహన పెంచుకుంటేనే మహిళలకు పూర్తి రక్షణ లభిస్తుందని ఆసిఫాబాద్ సీనియర్ సివిల్ జడ్జి సంకేత్ మిత్ర అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం బంబార గ్రామ సర్పంచ్ కృష్ణాజీ అధ్యక్షతన మహిళలకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ.. వివాహాలు చట్టరీత్యా నేరమని, వాటిని అరికట్టే బాధ్యత సమాజంపై ఉందన్నారు.