MDK: రామాయంపేటలో యువకులు స్వచ్ఛందంగా BRS పార్టీలో చేరగా వారికి మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, కల్యాణలక్ష్మి పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయన్నారు. కాంగ్రెస్ హామీల అమలులో విఫలమైందని విమర్శిస్తూ, యువతకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.