TPT: తిరుపతిలో కానిస్టేబుల్ హత్యకు నిందితులను ప్రేరేపించిన ఆరోపణలపై లాయర్ గుణశేఖర్‌పై కేసు నమోదైంది. ఒక కేసులో పట్టుబడిన ముద్దాయిలతో ‘కానిస్టేబుల్‌ను చంపిస్తే అన్నీ నేను చూసుకుంటా’ అని ఆయన అన్నట్లు సమాచారం. వారు నిరాకరించడంతో, గంజాయి కేసుల్లో అరెస్టైన వారితోనూ హత్యకు ఒప్పందానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.