అన్నమయ్య: చిట్వేల్ మండల కార్యాలయంలో స్వర్ణ గ్రామము, స్వర్ణ వార్డు జిల్లా అధికారి బి. గంగాభవాని ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ సర్వేలు, సెన్సస్ ఇన్యూమరేషన్ పురోగతిని పరిశీలించి పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం గ్రామ పరిశుభ్రత, స్వచ్ఛ రథం నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణపై పీడీవోలతో చర్చించారు.