JN: స్టేషన్ ఘన్పూర్ మండల పరిధిలోని ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించి తగిన చర్యలు చేపట్టాలని బీజేపీ కార్యకర్తలు కోరారు. ఈ మేరకు ఇవాళ స్టేషన్ ఘన్పూర్ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు రాజు యాదవ్ మాట్లాడుతూ.. అక్రమాలపై విచారణ జరిపి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు.