PLD: బక్రీద్ సందర్భంగా ప్రభుత్వం 28న సెలవు ప్రకటించడంతో, ఆ రోజు జరగాల్సిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేసినట్లు జిల్లా అధికారి ఎం. నీలావతి దేవి తెలిపారు. మార్చిన షెడ్యూల్ ప్రకారం.. ఎకనామిక్స్ పేపర్-I, మ్యాథమెటిక్స్ పేపర్-IIB పరీక్షలను వచ్చే నెల 5న నిర్వహించనున్నారు. అలాగే, వచ్చే నెల 6న జరగాల్సినవి 12కి వాయిదా వేశారు.