కర్నూలులో ఎరుకుల శంకర్ మృతి ఘటనపై 4వ టౌన్ ఎస్సై శరత్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. దాడి ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదును సరిగా నమోదు చేయలేదని ఆరోపించారు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టకుండా కాలయాపన చేశారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సైను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.