టీపీసీసీ ఎస్సీ సెల్ కార్యదర్శిగా హసన్పర్తి మండల కేంద్రానికి చెందిన దుర్గారావు నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ.. రాబోయే కార్పొరేషన్, మండల పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని అన్నారు.