MHBD: కురవి మండలంలో వడదెబ్బతో ఒకేరోజు ముగ్గురు మృతి చెందారు. శనివారం మండలంలోని బలపాలకు చెందిన రొయ్యల పెద్ద రాములు(75), బంగారిగూడెంకు చెందిన మూడు జాన్వ(40), సీరోల్ మండలం బిల్య నాయక్ తండాకు చెందిన బానోత్ కమిలి(65) మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.