WNP: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీఎస్పీ గిరిబాబును మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. శనివారం డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ గిరిబాబుతో కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిసలైన వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.