MDCL: ఉప్పల్ స్టేడియంలో IPL మ్యాచ్లకు మల్కాజ్గిరి పోలీసులు సమర్థవంతమైన బందోబస్తు కల్పించారని సీపీ సుమతి IPS తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, పటిష్ట భద్రత, బ్లాక్ టికెట్ల అడ్డుకట్టతో క్రికెట్ అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షిత వాతావరణం అందించామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు చూపిన చొరవను అభినందిస్తూ సన్రైజర్స్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.