విజయనగరం మండలం ద్వారపూడిలో శనివారం నిర్వహించిన ‘స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పాల్గొన్నారు. ఇంధనం పొదుపు, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా ఆమె ఒక వినూత్న అడుగు వేశారు. కాలుష్య నివారణే ధ్యేయంగా తన నివాసం నుండి ద్వారపూడి గ్రామం వరకు స్వయంగా ఎలక్ట్రిక్ స్కూటర్ పై ప్రయాణించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.