E.G: రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ రాజానగరంలోని ఆయన కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అర్జీలు స్వీకరించారు. ఈ మేరకు తాగునీరు, రోడ్లు, పింఛన్లు, రేషన్ కార్డులు, తదితర సమస్యలపై ప్రజల నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు. వీటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.