ASR: డుంబ్రిగూడ మండలం గోరాపూర్ గ్రామంలో జిల్లా స్థానిక ఫిర్యాదుల కమిటీ చైర్పర్సన్ కృష్ణకుమారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో మొత్తం 110 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 66 మందికి కళ్లద్దాలు అవసరమని వైద్యులు సూచించారు. అలాగే 9 మందిలో ముత్యబిందు సమస్యను గుర్తించగా, మరో ఇద్దరికి ప్టెరిజియం వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు.