BHNG: నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లాలోని రాజాపేట, యాదగిరిగుట్ట, ఆలేరు బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. అలాగే ట్రిపుల్ ఆర్ రైతులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు. కొందరు నాయకులను గృహ నిర్బంధం చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు.