ATP: గుత్తిలోని బండగేరిలో తాగునీటి కోసం మహిళలు కోళాయి వద్ద మాట మాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో పలువురు మహిళలు లక్ష్మీదేవి అనే మహిళపై దాడి చేసి గాయపరిచారు. గాయపడిన లక్ష్మీదేవిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.