TPT: తిరుమల వరాహస్వామి ఆలయం వెనుక అపస్మారక స్థితిలో కనిపించిన గుర్తుతెలియని మహిళ చికిత్స పొందుతూ SVIMS ఆసుపత్రిలో మృతి చెందింది. మృతురాలి వయస్సు 55-65 సంవత్సరాల మధ్య ఉండగా, గుండు చేయించుకుని చామనచాయ వర్ణంతో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మృతదేహాన్ని SVIMS మార్చురీలో భద్రపరిచారు. మహిళను ఎవరైనా గుర్తిస్తే తిరుమల 1 టౌన్ పోలీసులను సంప్రదించాలన్నారు.