KNR: కరీంనగర్-1 డిపో ఆధ్వర్యంలో అన్నవరం–వైజాగ్ ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు డీఎం విజయ మాధురి తెలిపారు. మే 27 సాయంత్రం సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరి 29 రాత్రి తిరిగి చేరుతుంది. అన్నవరం, పిఠాపురం, సింహాచలం, వైజాగ్ బీచ్, ద్వారకా తిరుమల దర్శనం ఉంటుంది. పెద్దలకు రూ.3,500, పిల్లలకు రూ.2,625 టికెట్ ధరగా నిర్ణయించారు. వివరాలకు 7382849352 సంప్రదించాలి.