NRPT: నారాయణపేట పట్టణంలోని 23, 24వ వార్డుల్లో శనివారం మున్సిపల్ ఛైర్ పర్సన్ కొండా శ్వేతా సత్య యాదవ్, మున్సిపల్ కమిషనర్ శంకర్ విస్తృతంగా పర్యటించారు. వార్డుల్లో ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను నేరుగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రోడ్ల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు వంటి సమస్యలపై చర్చించి, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు.