ASR: డుంబ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ అంత్రిగుడ గ్రామానికి చెందిన కొర్ర సొంబ్రు నిన్న చాపరాయిలో స్నానానికి దిగి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడి భార్య దివ్యాంగురాలు కావడంతో కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో వైసీపీ డుంబ్రిగూడ మండల కార్యదర్శి శంకర్ శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి తనవంతు సహాయంగా కొంత నగదును అందజేశారు.