TG: రాష్ట్రంలో పర్సంటేజ్ ప్రకారమైతేనే సినిమాలు ఆడిస్తామని తెలంగాణ ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. రామ్చరణ్ ‘పెద్ది’ మూవీకి కూడా పర్సంటేజ్ కావాల్సిందేనన్నారు. ‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కమిటీతో రెండు మూడు సార్లు చర్చలు జరిగాయి. నిర్మాతలు కావాలనే ఆలస్యం చేస్తున్నారు. మాకు పర్సంటేజ్ విధానం కావాల్సిందే’ అని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ పేర్కొన్నారు.