VKB: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పరిగి పట్టణ ప్రధాన రహదారి పక్కన ఉన్న ఒక భవనంపై పోలీసులు జరిపిన దాడిలో, రెడ్ హ్యాండెడ్గా పేకాట ఆడుతూ దొరికిన ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 31,450 నగదు, పేక ముక్కలు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితులపై చట్టపరమైన చర్యల నిమిత్తం వారిని పరిగి పోలీస్ స్టేషన్కు తరలించారు.