RR: యువతలో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు సైబరాబాద్ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ‘Coffee with a Cop’ రెండో ఎడిషన్ ద్వారా 16 నుంచి 25 ఏళ్ల మధ్య యువతకు సురక్షిత వేదిక కల్పించి, తమ భావాలు, సమస్యలు, ఒత్తిళ్లను స్వేచ్ఛగా పంచుకునే అవకాశం ఇచ్చారు. ఈ కార్యక్రమం యువత-పోలీసుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతూ విశ్వాస బంధాన్ని మరింత బలపరిచింది.