KMR: భూగర్భ జలాలు అత్యంత తక్కువగా ఉన్న చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలని డీఆర్డీవో పీడీ దామోదర్ రెడ్డి తెలిపారు. సదాశివనగర్ మండలం కల్వరాల్ గ్రామ చెరువులో పూడికతీత పనులను పరిశీలించారు. వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెంచేందుకు ఒక లక్ష్యంతో చేపట్టిన ఇటువంటి కార్యక్రమాలను అందరి సహకారంతో విజయవంతం చేసుకోవాలని కోరారు.