CTR: నంద్యాల వాసి చిత్తూరులో ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. 2 టౌన్ సీఐ నెట్టికంఠయ్య వివరాల మేరకు.. నంద్యాల(D) సున్నిపెంటకు చెందిన రాజశేఖర్ (37) చిత్తూరులోని పలమనేరు రోడ్డులో ఓ ఏజెన్సీలో మేనేజర్‌గా ఉన్నాడు. అప్పులబాధ భరించలేక అర్ధరాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.