TG: రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతల నేపథ్యంలో వచ్చే 3 రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. వృద్ధులు, పిల్లలు అత్యవసరమైతేనే బయటకు రావాలని చెప్పారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద మజ్జిగ, ఓఆర్ఎస్లు అందుబాటులో ఉంచాలన్నారు. వడదెబ్బతో మృతి చెందినవారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని తెలిపారు.