BDK: అశ్వారావుపేట (మం), శ్రీ లక్ష్మీ తులసి ఆగ్రో పేపర్ బోర్డు పరిశ్రమపై కాలుష్య ఆరోపణలు తీవ్రం అవుతున్నాయి. పరిశ్రమ నుంచి వెలువడుతున్న మురుగు జలాలు, పొగ, దుర్వాసన వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, పంటలు దెబ్బతింటున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ నిబంధనలు ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.